అక్షరటుడే, వెబ్‌డెస్క్: India vs New Zealand Test | న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇప్పటికే భారత్ (India) టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకుంది. టెస్ట్‌ల్లో సైతం గెలిచి అన్ని సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మేరకు భారత ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతున్నారు. న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 159/1 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించింది. కేఎల్ రాహుల్ (135) సెంచరీతో రాణించాడు. సేనా దేశాల్లో తొలి సెంచరీ చేసిన ఓపెనర్‌గా నిలిచాడు.
India vs New Zealand Test | గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 98 పరుగులతో రాణించాడు. మ్యాచ్ ముగిసే కొద్ది సమయానికి ముందు అతడు జాకోబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. పడికల్ 80 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రిషబ్ సైతం హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ (55), అంకుశ్ కాంబోజ్ ఉన్నారు. భారత్ 118 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇది కూడా చదవండి..: Suryakumar Yadav | మోదీని కలిశాకే నా లక్ మారింది: సూర్యకుమార్ యాదవ్