అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Land Issues | రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్ భూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
భూ భారతి (Bhu Bharati) చట్టం అమలు, రైతులకు పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారంపై మంత్రి పొంగులేటి అధికారులతో చర్చించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు పారదర్శకంగా, వేగంగా అందేలా పకడ్బందీగా పనిచేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, స్వార్థపూరిత నిర్ణయాలతో పదేళ్లలో రెవెన్యూ వ్యవస్థ అస్థవ్యస్తమైందని విమర్శించారు.
Land Issues | కాంగ్రెస్ పాలనలో..
కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చాలని రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. భూ భారతి చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 12,40,366 పాస్ బుక్ లను రైతులకు అందించామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో రీ-సర్వే నిర్వహించి హక్కుదారులకు పాస్‌బుక్కులు అందిస్తామని పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Rajarajeshwari Devi Alankaram | చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం.. పూజా విధానం, నైవేద్యం పూర్తి వివరాలు ఇవే..!