అక్షరటుడే, వెబ్‌డెస్క్: Congress SC Cell | కాంగ్రెస్ పార్టీ (Congress Party) SC సెల్ రాష్ట్ర కమిటీని నియమించింది. ఈ మేరకు ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గతంలోనే డీసీసీలను నియమించిన కాంగ్రెస్ తాజాగా ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీని నియామకం పూర్తి చేసింది. ఈ కమిటీలో 16 మంది వైస్ ఛైర్మన్లు, 9 మంది జనరల్ సెక్రెటీరీలు, 29 మంది సెక్రెటరీలు 29 ఉంటారు. అలాగే 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన ఎస్సీ సెల్ చైర్మన్ నియమించారు.
Congress SC Cell | పార్టీ బలోపేతం కోసం..
కాంగ్రెస్‌లో కష్టపడే వారికి పదవులు లభిస్తాయని కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కొత్తగా పదవులు పొందిన వారు పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పేర్కొన్నారు.
Congress SC Cell | జిల్లా ఛైర్మన్లు వీరే..
రాష్ట్రంలోని 27 జిల్లాలకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులను తాజాగా నియమించారు. ఆదిలాబాద్–పరమేశ్వర్, మంచిర్యాల – నర్సింలు, నిర్మల్ – కట్ట శ్యాం సుందర్, ఆసిఫాబాద్ – దుర్గం హంసరాజు, కరీంనగర్ – కొరివి అరుణ్ కుమార్, జగిత్యాల – దుమాల రాజుకుమార్, సిరిసిల్ల – పండుగ ప్రదీప్, కామారెడ్డి – బూమాని బాల్‌రాజ్, హన్మకొండ – ఆరూరి సాంబయ్య, వరంగల్ – చిలువేరు శ్రీనివాస్, జనగామ – చేపూరి వినోద్, సంగారెడ్డి– శ్రీహరి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కరుణాకర్ నియామకం అయ్యారు.
ఇది కూడా చదవండి..: Ponguleti Comments | బీఆర్ఎస్లో హరీశ్‌రావు ఫ్యూచర్ ఏంటో.. పొంగులేటి కౌంటర్


