Hyderabad Lawyer Murder | హైదరాబాద్​లో న్యాయవాది హత్య

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Lawyer Murder | హైదరాబాద్​లో ఓ న్యాయవాది హత్య తీవ్ర కలకలం రేపింది. నాంపల్లి పోలీస్​ స్టేషన్​ (Nampally Police Station) పరిధిలోని మాసబ్​ట్యాంక్​లో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను శనివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. కారులో ఎక్కడానికి యత్నిస్తుండగా దుండగులు మరో కారులో వేగంగా వచ్చి ఢీకొన్నారు.

ఖాజా మొయినుద్దీన్ వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. తన ఇంటి నుండి బయటకు రాగానే న్యాయవాదిని
కారుతో ఢీ కొట్టి దుండగులు పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.

Hyderabad Lawyer Murder | సీసీ కెమెరాలో రికార్డు

న్యాయవాదిని కారుతో ఢీకొన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఖాజా మొయినొద్దీన్​ ఇంట్లో నుంచి బయటకు రాగానే.. వేగంగా వచ్చి ఆయనను మరో కారుతో ఢీకొన్నారు. నిందితులు ఆయన కోసం మాటు వేసినట్లు తెలుస్తోంది. బయటకు రాగానే కారును వేగంగా తీసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న ఆయనను ఢీకొన్నారు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: CM Yadagirigutta Visit | యాదగిరిగుట్టలో సీఎం పర్యటన.. వేద పాఠశాలకు శంకుస్థాపన

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *