అక్షరటుడే, వెబ్‌డెస్క్: Odisha Fire Accident | ఒడిశా (Odisha)లోని మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. పవర్ స్టేషన్ షట్‌డౌన్ అయిన అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
విద్యుత్ కేంద్రం (Power Station)లో మంటలు అంటుకున్న సమయంలో పలువురు కార్మికులు రెండో అంతస్తులో చిక్కుకుపోయారు. దట్టంగా పొగలు వ్యాపించడం, మంటలు ఎగిసి పడుతుండటంతో లోపలికి ఎవరు వెళ్లలేకపోతున్నారు. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Odisha Fire Accident | కొండల మధ్యలో..
ఈ విద్యుత్ కేంద్రం కొండల మధ్య ఉంది. దీంతో అగన్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అయితే లోపల ఎంతమంది కార్మికులు చిక్కారో ఇంకా స్పష్టత రాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: Varanasi Incident | కాశీలో గంగాస్నానం చేస్తూ బీరు తాగిన వ్యక్తి.. కేసు నమోదు


