అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Caste Names Change | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు కులాల పేర్లను మార్చింది. సమాజంలో చిన్న చూపు ఉన్న, తిట్లుగా ఉపయోగిస్తున్న కులాల పేర్లను మారుస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ బాలమాయా దేవి (Principal Secretary Balamaya Devi) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ (BC Commission) ఈ నెల 12న సమావేశం నిర్వహించింది. కొన్ని కులాలను చిన్న చూపుస్తున్నారని, వారి కులనామాన్ని తరచుగా అవమానకరంగా, దూషణాత్మకంగా ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఆయా కులాల పేర్లు మార్చాలని ప్రభుత్వాన్ని సూచించింది. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘దొమ్మర’ కులం పేరును ‘గద వంశీయ’గా మార్చింది. ఇది సమాజంలో ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుందని, పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాలలో వివక్ష నుంచి ఆ సామాజిక వర్గ ప్రజలను కాపాడుతుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మార్గం సుగమం చేస్తుందని తెలిపింది.
Caste Names Change | వీరభద్రీయగా.. వీర ముష్టి కులం
తమ్మలి సముదాయానికి సంబంధించిన వెనుకబడిన తరగతుల జాబితాలోని “శూద్ర కులం” అనే పదాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ‘వీరముష్టి’ అనే పేరును ‘వీరభద్రీయ’గా సవరించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడిన తరగతుల జాబితాలోని ‘గ్రూప్-D’ కింద క్రమ సంఖ్య 5 వద్ద ‘మేరు’ను పర్యాయపదంగా చేర్చడానికి ఆమోదం తెలిపింది. ‘ధోబీ’ని పర్యాయపదంగా చేర్చడానికి, ‘వన్నార్’ అనే పదాన్ని తొలగించింది.
Caste Names Change | ఆ పదం తొలగింపు
వెనుకబడిన తరగతుల జాబితాలో బుడబుక్కల సముదాయానికి పర్యాయపదంగా “శివ క్షత్రియ”ను ప్రభుత్వం చేర్చింది. బీసీ జాబితా నుండి “పిచ్చిగుంట్ల” అనే పదాన్ని తొలగించింది. ఆ పదాన్ని అవమానకరమైన, అగౌరవప్రదమైన రీతిలో ఉపయోగిస్తున్నారని, ఇది ఆ సముదాయానికి అవమానాన్ని కలిగిస్తోందని కమిషన్ పేర్కొంది. ఆ కులం పేరును వంశరాజ్గా మార్చింది.
The Government has issued Orders for the modification of nomenclature of Veeramushti to Veerabhadreeya pic.twitter.com/apVgx1xrrw
— Jacob Ross (@JacobBhoompag) May 23, 2026
దీనిని కూడా చదవండి : Inter College Midday Meal | ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. కేబినెట్ కీలక నిర్ణయం


