Alumni Reunion | 15 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Alumni Reunion | నందిపేట(Nandipet) మండలం బాద్గుణ ఉన్నత పాఠశాల (Badguna High School) 2010-11 పదోతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలని ఆదివారం ఘనంగా నిర్వహించారు. బాద్గుణలో (badguna) నిర్వహించిన కార్యక్రమంలో 15 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన పూర్వ విద్యార్థులు పాఠశాలలో వారి జ్ఞాపకాలు అనుభవాలను నెమరు వేసుకున్నారు.

Alumni Reunion | యోగక్షేమాలు తెలుసుకుని..

చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న పాత మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆనాటి పాఠశాల అనుభవాలను నెమరు వేసుకున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఆయా రంగాలకు సంబంధించిన విషయాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా రోజంతా ఆనందంగా గడిపారు. మరోసారి అందరూ తప్పకుండా కలుసుకోవాలని తీర్మానించుకుని వీడ్కోలు పలికారు. నాడు తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయులను(teacher felicitation) ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం దేవరాజ్, ఉపాధ్యాయులు తిరునగర్ ప్రసాద్, సాగర్,పవన్, రాములు, సదానంద్,అశోక్ రావు, రమేష్, జోషి, వీణ, ప్రభాకర్ సాయన్న, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Pakistan Train Blast | పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *