అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief Birthday | నగరంలోని కాంగ్రెస్ భవన్లో (Congress Bhavan) పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Birthday) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు.
PCC Chief Birthday | 1987లో కరాటే మాస్టర్‌గా ఉన్న సమయంలో..
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ పీసీసీ చీఫ్ బర్త్ డే సందర్భంగా నగరంలోని (Nizamabad city) పలు ఆలయాల్లో పూజలు నిర్వహించామన్నారు. 1987లో మహేష్ కుమార్ గౌడ్ కరాటే మాస్టర్‌గా ఉన్న ఆయనకు ఉన్న క్రేజ్‌ను చూసిన డీఎస్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, కార్యనిర్వహక అధ్యక్షుడిగా అంచలంచెలుగా ఎదిగారన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిజీ షెడ్యూల్ కారణంగా గాంధీభవన్ బాధ్యతలన్నీ మహేష్‌కుమార్ గౌడ్ చూసుకునేవారన్నారు. దీంతో ఆయనకున్న అనుభవాన్ని చూసిన రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా నియమించారన్నారు.
కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కల్లుగీత కార్మిక ఛైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణ, డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ గన్ రాజ్, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, గాదరి గోపి, రత్నాకర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ గౌడ్, కాంజర్ రవి, గోపాల్ నగేష్, మాజీ మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు.
అలాగే మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, గడుగు రోహిత్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, డీసీసీ నగర కోశాధికారి శివ, కార్పొరేటర్లు మనోహర్, ప్రవీణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు కుద్దుస్, నగర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర ఎస్సీ మాజీ అధ్యక్షుడు వినయ్, యూత్ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్, డీసీసీ కార్యదర్శి ముల్గురి గణేష్, నరేంద్ర సింగ్, మెయిన్, గోపి, పోలా ఉష, స్వప్న, అపర్ణ, విజయరాణి, భాస్కర్, గోవర్దన్, మధు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan Train Blast | పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి


