తెలంగాణWomen Super Bazaars | మహిళా​ శక్తి సూపర్​ బజార్ల ఏర్పాటు.. అతివలకు సీఎం గుడ్​న్యూస్

Women Super Bazaars | మహిళా​ శక్తి సూపర్​ బజార్ల ఏర్పాటు.. అతివలకు సీఎం గుడ్​న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మహిళలకు గుడ్​న్యూస్​ చెప్పారు. నియోజకవర్గాల కేంద్రాల్లో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Women Super Bazaars | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మహిళలకు గుడ్​న్యూస్​ చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా నియోజకవర్గాల కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందిర మహిళ శక్తి సూపర్ బజార్లతో పాటు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. బ్యాంకుల నుంచి వీటికి అవసరమైన రుణాలను ప్రభుత్వం ఇప్పిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల (Self-Help Groups) కోసం 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Women Super Bazaars | 119 నియోజకవర్గాల్లో..

ముఖ్యమంత్రి మాట్లాడుతూ సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి మొదటి విడతగా 119 నియోజకవర్గ కేంద్రాల్లో అవసరమైన స్థలం గుర్తించి మహిళా సంఘాలకు నామినల్ అద్దె ప్రాతిపదికన 30 ఏళ్లపాటు లీజుపైన ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సూపర్ బజార్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తామని, సంఘాల్లోని ప్రతి మహిళ కొంత మేరకు పెట్టుబడిని సమకూర్చుకోవాలని సూచించారు.

Women Super Bazaars | రుణాలు ఇప్పిస్తాం

మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులను పెట్టుకోవాలని, లాజిస్టిక్ సెంటర్లను కట్టుకోవాలని సూచించారు. మండలాల్లో స్థలాలు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో బ్యాంకుల నుండి రుణాలను ఇప్పించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రతి మండలంలో 2 నుండి 4 స్థలాలను గుర్తించి గోడౌన్లు నిర్మించుకోవడానికి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ చీరల మోడళ్లను ఆవిష్కరించారు.

Women Super Bazaars

దీనిని కూడా చదవండి : ORR Rash Driving | ‘రీల్స్’ పిచ్చి: ఓఆర్‌ఆర్‌పై 200 కి.మీ వేగంతో మృత్యు విన్యాసాలు.. యువకుడి అరెస్టు

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Cattle Smuggling | పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా : ఎస్పీ రాజేష్ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: Cattle Smuggling | బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో...

Air India Crash Report | అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. నేరుగా తుది నివేదికే ఇస్తామన్న కేంద్రం

అక్షరటుడే వెబ్‌డెస్క్: Air India Crash Report | అహ్మదాబాద్‌లో(Ahmedabad) జరిగిన...

ACB Trap | భూ సర్వే చేసినందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం...

Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేదు.. దానిపైనే చర్చ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka CM Change | కర్ణాటకలో సీఎం...