నిజామాబాద్Cattle Smuggling | పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా : ఎస్పీ రాజేష్ చంద్ర

Cattle Smuggling | పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా : ఎస్పీ రాజేష్ చంద్ర

బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

అక్షరటుడే, కామారెడ్డి: Cattle Smuggling | బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా, పటిష్ట బందోబస్తు (Kamareddy police) ఏర్పాటు చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Cattle Smuggling | అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..

ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్(Bakrid) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లాలోని అన్ని ఈద్గాలు, ప్రధాన మసీదులు, జామియా మసీద్ ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన మార్కెట్లు, పశువుల సంతలు, వాణిజ్య సముదాయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిఘా ఉంటుందన్నారు. జిల్లా సరిహద్దుల్లోని అన్ని తనిఖీ చెక్ పోస్టులు, ప్రధాన రహదారులు, హైవేలపై 24/7 నిఘా ఉంటుందన్నారు.

గతంలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా విభాగాలు, పికెట్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని ముఖ్య కూడళ్లు, ఈద్గాల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చెక్‌పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, అనుమతి లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ACB Trap | భూ సర్వే చేసినందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Karnataka Congress Reset | కర్ణాటక కాంగ్రెస్‌లో ‘పవర్ రీసెట్’.. సిద్ధరామయ్యకు స్థానచలనం.. శివకుమార్‌కు పట్టాభిషేకం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka Congress Reset | దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా...

Heavy Rain Havoc | గాలివాన బీభత్సం.. రైతుల ఇక్కట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Havoc | తెలుగు రాష్ట్రాలను...

ACB Raid | నాలా కన్వర్షన్​ కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా...

భారత్‌లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు టుమారో మేకర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గోద్రేజ్ ఫౌండేషన్

వెనుకబడిన వర్గాల ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించేందుకు గోద్రేజ్ ఫౌండేషన్ సరికొత్త జాతీయ...