అక్షరటుడే, వెబ్‌డెస్క్: Panipuri Food Poisoning | పానీపూరి.. చాలా మంది ఇష్టంగా తినే చాట్. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా తింటారు. విద్యార్థులు సైతం గప్చుప్లను ఇష్టంగా లాగిస్తారు. అయితే చాలా మంది పానీపూరి సెంటర్ల వారు పరిశుభ్రత పాటించారు. దీంతో దానిని తిన్న వారు అనారోగ్యం బారీన పడుతారు.
గద్వాల జిల్లా (Gadwal District) అయిజ మున్సిపాలిటీలో పానీపూరి తిని 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కొంతమంది అమ్మాయిలు రాత్రి 7:30 గంటలకు పాని పూరి తినేందుకు వెళ్లారు. అది తిన్న తర్వాత కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రులకు తరలించారు.
Panipuri Food Poisoning | పోలీసుల దర్యాప్తు

బాధితులు ప్రస్తుతం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పాత బస్టాండ్ కూడలి వద్ద ఉన్న ఓ పానీపూరి బండి దగ్గర పానీపూరీ తిన్నట్లు బాలికలు తెలిపారు. దీంతో బాధిత యువతుల కుటుంబ సభ్యులు పానీపూరి బండి దగ్గర ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానాకి చేరుకున్నారు. బండిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై మల్లేష్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Heavy Rain | అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. రైతులకు తీవ్ర నష్టం


