Splendor Xtec 2.0 | హీరో నుంచి సూపర్ స్ల్పెండర్​ ఎక్స్‌టెక్ 2.0..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Splendor Xtec 2.0 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సూపర్ స్ల్పెండర్​ ఎక్స్‌టెక్ 2.0ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇంధన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా డిజైన్ , టెక్నాలజీ పరంగా పలు మార్పులు చేసి ఈ మోడల్​ను తీసుకువచ్చారు. దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ.86,500గా నిర్ణయించింది.

Splendor Xtec 2.0 | ఇంజిన్..

ఇందులో 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 7500 ఆర్‌పీఎం వద్ద 10 హెచ్పీ పవర్‌ను, 6000 ఆర్పీఎం వద్ద 10.6 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, ఐడీల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ వంటివి మైలేజీ పెంచడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. హెవీ ట్రాఫిక్‌లోనూ బైక్ స్మూత్‌గా రీస్టార్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ఐఎస్‌జీ) ఫీచర్‌ను కూడా యాడ్ చేశారు. దీనివల్ల ఇంజిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెద్దగా శబ్దం ఉండదు.

Splendor Xtec 2.0

Splendor Xtec 2.0 | సెఫ్టీ, డిజిటల్ ఫీచర్స్ ..

రైడర్ల సేఫ్టీ, కంఫర్ట్ కోసం కంపెనీ ఈ బైక్‌లో సరికొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లను జోడించారు. ఈ సిరీస్‌లో హజార్డ్ లైట్స్ ఆప్షన్‌ను చేర్చారు. బెటర్ బ్రేకింగ్ కోసం ముందువైపు డిస్క్‌బ్రేక్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, హ్యాండిల్‌బార్‌పై ఇంజిన్ కిల్ స్విచ్ వంటివి ఉన్నాయి. ఇందులోని ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఇన్‌కమింగ్ కాల్స్/ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు, ఫోన్ బ్యాటరీ స్టేటస్ వంటివి తెలుసుకోవచ్చు. రియల్‌టైమ్ మైలేజీ ఇండికేటర్ కూడా ఉంది.

Splendor Xtec 2.0 | కలర్ ఆప్షన్లు..

గ్లోసీ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే, మ్యాట్ నెక్సస్ బ్లూ, మ్యాట్ చెస్ట్నట్ బ్రౌన్ రంగుల్లో లభిస్తుంది. డైనమిక్ డ్యుయల్ టోన్ బాడీ గ్రాఫిక్స్, స్టైలిష్ కలర్ స్కీమ్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

ఇది కూడా చదవండి..: Honda NX500 | ఇక క్లచ్‌తో పనిలేకుండా గేర్లు మార్చుకోవచ్చు.. అడ్వెంచర్ బైక్ ను విడుదల చేసిన హోండా

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *