Telangana Employee Arrears | ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Employee Arrears | తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి నిరూపించింది. ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల క్లియరెన్స్ ప్రక్రియను శరవేగంగా ప్రారంభించింది. 100 రోజుల్లో రూ. 6,000 కోట్ల ఉద్యోగుల బకాయిలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ జేఏసీ (JAC) నేతలకు గతంలో హామీ ఇచ్చారు. ఈ ప్రాధాన్యత క్రమంలోనే ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం (మే 29) తొలి విడతగా రూ. 2,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
telangana 3

 

Telangana Employee Arrears | రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు క్లియర్..

తాజాగా విడుదల చేసిన ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన అత్యంత కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిల మొత్తాన్ని నూటికి నూరు శాతం (100%) క్లియర్ చేశారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ కూడా ప్రభుత్వం పూర్తిగా చెల్లించేసింది.

revanth.1 1

Telangana Employee Arrears | గడువులోగా మిగిలిన రూ.4,000 కోట్లు..

పక్కా ప్రణాళికలు, ముందస్తు కార్యాచరణతోనే ఇంత తక్కువ సమయంలో నిధుల విడుదల సాధ్యమైందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ. 4,000 కోట్ల బకాయిలను కూడా నిర్దేశిత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న ఈ శరవేగ నిర్ణయాల పట్ల ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 

ఇది కూడా చదవండి: NEET UG Leak | జవాబుదారీతనం అవసరం.. నీట్ విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *