Bandi Sanjay Comments | రేవంత్ – రాహువు, కేసీఆర్ – కేతువు : బండి సంజయ్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Comments | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్​పై కేంద్ర మంత్రి బండి సంజయ్​ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్​ రాహువు అని, కేసీఆర్​ కేతువు అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్​లో మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్​రెడ్డి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ (KCR) సోమవారం బహిరంగ సభల్లో ప్రసగించిన విషయం తెలిసిందే. వారిపై బండి సంజయ్​ స్పందించారు. కేసీఆర్, రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్​రెడ్డి మాట మార్చారని విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇన్ని రోజుల్లో కేసీఆర్​ కుటుంబంలో ఒక్కరిపైనా అయినా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు.

Bandi Sanjay Comments | ఏటీఎంలా మారింది

కాళేశ్వరం ప్రాజెక్ట్​ (Kaleshwaram Project) గతంలో బీఆర్​ఎస్​కు, ప్రస్తుతం కాంగ్రెస్​కు ఏటీఎంలా మారిందని బండి సంజయ్​ ఆరోపించారు. సీఎం సోమవారం మాట్లాడుతూ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాశామన్నారు. దీనిపై బండి స్పందిస్తూ.. ఆ లేఖలో ఏముందో చెప్పాలన్నారు. రూ.9వేల కోట్ల అవినీతిపై దర్యాప్తు జరపాలని సీఎం లేఖలో రాశారని, మరి రూ.లక్ష కోట్ల కుంభకోణం గురించి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి రాసిన లేఖను ఇంటింటికి పంచుతామని చెప్పారు.

Bandi Sanjay Comments

Bandi Sanjay Comments | బీఆర్​ఎస్​తో కలవం

మహిళా రిజర్వేషన్​ బిల్లు (Women’s Reservation Bill)ను ఇటీవల విపక్షాలు అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు వారి కుటుంబాల్లోని మహిళలకు పదవులు వస్తే మొత్తం మహిళలకు వచ్చినట్లు భావిస్తున్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్​ బిల్లు వీగిపోతే రేవంత్​రెడ్డి సంబరాలు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఎప్పటికీ కలవవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Defence Liquor Seizure | రూ.10 లక్షల విలువైన డిఫెన్స్ మద్యం పట్టివేత

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *