Kamareddy Murder Case | కామారెడ్డిలో వ్యక్తి దారుణ హత్య

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Murder Case | ఇంట్లోనుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి(55) ఈ నెల 29 న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి అడిగినా, బంధువుల వద్ద ఆరా తీసినప్పటికి రాజిరెడ్డి ఆచూకీ లభించలేదు. దాంతో శనివారం రాజిరెడ్డి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Kamareddy Murder Case

Kamareddy Murder Case | భూ తగదాలే కారణామా..

రాజిరెడ్డికి గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో భూ తగాదాలు కొనసాగుతున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అదే సమయంలో శనివారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ ఫంక్షన్ హాలు సమీపంలోని వ్యవసాయానికి బావిలో రాజిరెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. రాజిరెడ్డి హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. డీఎస్పీ మధుసూదన్ రావు (DSP Madhusudan Rao) ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య బావిలో నుంచి శనివారం అర్ధరాత్రి రాజిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. భూ తగాదాల నేపథ్యంలోనే రాజిరెడ్డి హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగితుందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఎస్పీ తెలిపారు. కాగా హత్యకు పాల్పడిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

దీనిని కూడా చదవండి : Navsari POCSO Case | మృగం కంటే హీనం.. ఇద్దరు మైనర్​లపై సవతి తండ్రి కీచకపర్వం.. 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *