Ahmedabad Demolition Drive | అహ్మదాబాద్​లో భారీగా అక్రమ నిర్మాణాల కూల్చివేత

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Demolition Drive | గుజరాత్​లోని అహ్మదాబాద్​ జిల్లా (Ahmedabad District) దందుకాలో ధర్మేష్ గమారా హత్య తర్వాత స్థానిక యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టింది. మంగళవారం ఉదయం అధికారులు 14 షెడ్లు, 5 ఇళ్లను కూల్చివేశారు.దుందుకా నగరంలో ఇటీవల ధర్మేష్ గమారా హత్య తర్వాత అక్కడి వాతావరణం పూర్తిగా ఉద్రిక్తంగా మారింది.

ఈ తీవ్రమైన ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు యంత్రాంగం అత్యంత కఠిన వైఖరిని అవలంబించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. ఈ హత్య కేసులో నిందితులైన షబ్బీర్ చోప్రా, ఇంతియాజ్ పఠాన్ ఇళ్లలో ఉన్న అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించి, వారిపై ఫిర్యాదు నమోదు చేశారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న 12 వాణిజ్య సంస్థలకు (units) నోటీసులు జారీ చేశారు. నగరంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ యంత్రాంగం చేపట్టిన కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.

Ahmedabad Demolition Drive | భారీగా పోలీసు బందోబస్తు

ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎస్పీ, డిప్యూటీ ఎస్పీ స్థాయి అధికారులు కూల్చివేతలను పర్యవేక్షిస్తున్నారు. దుందుకా నుంచి రాన్‌పూర్ కూడలి వరకు ఉన్న రహదారిపై అడ్డంకులను తొలగించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 14 అక్రమ షెడ్లను తక్షణమే తొలగించనున్నారు. నగరంలోని సున్నితమైన ‘ఖత్కివాడ్’ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఐదు ఇళ్లను బుల్డోజర్ల సహాయంతో కూల్చి వేస్తున్నారు.

Ahmedabad Demolition Drive | డ్రోన్లతో గస్తీ

అహ్మదాబాద్ రూరల్ DSP ఆస్థా రాణా (DSP Astha Rana) మాట్లాడుతూ.. ఇక్కడ సుమారు 400 మంది పోలీసు సిబ్బందిని మోహరించామన్నారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రోన్ల ద్వారా కూడా గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ధర్మేష్ గమారా హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Ahmedabad Demolition Drive

Ahmedabad Demolition Drive | అసలు ఏం జరిగిందంటే..

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్ జిల్లా ధంధుకాలో శనివారం రెండు బైక్​లు ఢీకొన్నాయి. అనంతరం ఇరు వర్గాల మధ్య హింస చెలరేగింది. ఈ ఘర్షణలో ధర్మేష్ గమారా (30) కాలిపై కత్తితో పొడిచారు. రక్తస్రావం కారణంగా అతను మరణించాడు. అతని మరణం తరువాత, ఉద్రిక్తతలు చెలరేగి, ఒక గుంపు ఏడు నుంచి ఎనిమిది రోడ్డు పక్క దుకాణాలకు నిప్పు పెట్టింది. దీంతో హత్యకేసులో నిందితులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. హత్యలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై సమీర్, రిజ్వాన్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. దుకాణాలకు నిప్పు పెట్టిన 15నుంచి20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Manipur Earthquake | మణిపూర్​లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *