Woman Murder | బైక్​పై వెళ్తున్న దంపతులపై దాడి.. మహిళ మృతి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Woman Murder | బైక్​పై వెళ్తున్న దంపతులను అడ్డగించి దుండుగులు దాడి చేశారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద శనివారం రాత్రి భార్యాభర్తలు అనిల్ కుమార్, మీనా దేవి(35) బైక్​పై వెళ్తుండగా కొందరు అడ్డగించారు. అనంతరం మీనా దేవిని పొదల్లోకి లాక్కెళ్లారు. అడ్డుకున్న భర్త అనిల్ కుమార్‌పై కత్తులతో దాడి చేసి, అతని ముందే మీనా దేవి గొంతు కోసి హత్య చేశారు.

Woman Murder | ఎందుకు చంపారు

Woman Murder

దుండగులు భర్తను కత్తితో పొడిచి, మహిళ గొంతు కోసి పారిపోయారు. బాధితురాలి బంగారు ఆభరణాలు చెక్కుచెదరలేదని, లైంగిక దాడికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లేవని పోలీసులు తెలిపారు. దీంతో హత్య ఉద్దేశంపై మిస్టరీ మరింత పెరిగింది. మృతురాలి భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు, ఆస్తి తగదాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Extramarital Affair Murder | వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *