అక్షరటుడే, వెబ్‌డెస్క్: Employees Health Scheme | ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు అమలు చేస్తున్న జేహెచ్ఎస్ స్థానంలో కొత్త పథకం అమలు చేస్తామని గతంలో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
Employees Health Scheme | రేపు కమిటీ ఏర్పాటు
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తుంది. ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్ కు సీఈవోగా నియమిస్తారు. ఈ కమిటీని రేపు ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
Employees Health Scheme | ఆదేశాలు జారీ
ఈ పథకం అమలు కోసం అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మే 31లోపు డేటా అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు అందించనున్నారు. వాటితో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఇది కూడా చదవండి..: Woman Murder | బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి.. మహిళ మృతి


