అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana DEO Transfers | రాష్ట్రంలో పలువురు డీఈవోలు బదిలీ అయ్యారు. డీఈవోలతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
చాలా కాలంగా ఒకేచోట పని చేస్తున్న విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. జీవో నం.38 ప్రకారం పారదర్శకంగా బదిలీలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నీకోలస్ (Naveen Nicholas) ఆదివారం వెల్లడించారు. బోధనేతర సిబ్బంది బదిలీలను ఆన్‌లైన్ విధానంలో చేపట్టినట్లు పేర్కొన్నారు. అడిషనల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఆఫీస్ సబ్ ఆర్డినేట్ స్థాయి వరకు పోస్టుల బదిలీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.
Telangana DEO Transfers | బదిలీ అయిన డీఈవోలు
మేడ్చల్ డీఈవో (Medchal DEOO) విజయకుమారి మహబూబ్‌నగర్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. వికారాబాద్ నుంచి రేణుక మేడ్చల్‌కు వచ్చారు. హైదరాబాద్ విద్యాశాఖ అధికారి రోహిణి సంగారెడ్డికి బదిలీ అయ్యారు. సుశీందర్‌రావు రంగారెడ్డి నుంచి నల్గొండకు వచ్చారు. అక్కడ పని చేస్తున్న భిక్షపతి భువనగిరికి బదిలీ అయ్యారు. రంగారెడ్డి డీఈవోగా రేవతిరెడ్డి నియమితులయ్యారు. సనంగారెడ్డి డీఈవోగా పని చేసిన వెంకటేశ్వర్లు హైదరాబాద్ డీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శాస్త్రి సిద్దిపేట డీఈవోగా నియమితులయ్యారు.
దీనిని కూడా చదవండి : Telangana TET Schedule | తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల


