Prajavani Complaints | ప్రజల సమస్యలు పరిష్కరించాలి : సీపీ సాయిచైతన్య

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Prajavani Complaints | జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులను ఆదేశించారు.

Prajavani Complaints | ప్రజలకు దగ్గరయ్యేలా..

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించిన సీపీ వాటి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్​హెచ్​వోలు, ఎస్సైలతో ఫోన్​లో మాట్లాడారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో మొత్తం 32 ఫిర్యాదులు వచ్చాయి.

cp

దీనిని కూడా చదవండి : Telangana Employee Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై కఠిన ఆంక్షలు.. రూల్స్ బ్రేక్ చేస్తే జీతం కట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *