అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RDO Caught by ACB | నారాయణపేట (Narayanpet) రెవెన్యూ డివిజన్ అధికారి పత్లావత్ రామచందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బర్త్ సర్టిఫికెట్ కోసం లంచం అడగ్గా అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ఓ వ్యక్తి తన స్నేహితుల జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నాడు. బర్త్ సర్టిఫికెట్ (Birth Certificate) ఆలస్య నమోదుకు సంబంధించిన ఫైలు ఆమోదం కోసం ఆర్డీవో పత్లావత్ రామచందర్ రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమచారం అందించాడు. ఈ మేరకు మంగళవారం ఆర్డీవో లంచం తీసుకుంటుంగా.. మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

RDO Caught by ACB | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన ఇకోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి..: TGPSC PCB Jobs | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

