బిజినెస్​India Stock Market | 7వ స్థానానికి పడిపోయిన భారత స్టాక్ మార్కెట్

India Stock Market | 7వ స్థానానికి పడిపోయిన భారత స్టాక్ మార్కెట్

మార్కెట్ విలువ పరంగా భారత్ స్టాక్ మార్కెట్ స్థానం రోజురోజుకు దిగజారుతోంది. వారం క్రితం ఆరో స్థానానికి తగ్గగా.. తాజాగా ఏడో స్థానానికి పడిపోయింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సుమారు రెండేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్‌తో ప్రారంభమైన పతనం కొనసాగుతూనే ఉంది. పశ్చిమాసియాలో సంక్షోభంతో తీవ్రత మరింత పెరిగింది.

క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలు రావడం, విదేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, రూపాయి విలువ భారీగా పతనమవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుండడంతో స్టాక్ మార్కెట్ కోలుకోలేకపోతోంది. అంతర్జాతీయ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) పరంగా ఇటీవల తైవాన్ మనల్ని ఆరో స్థానానికి నెట్టేయగా.. తాజాగా సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ కోస్పీ ఏడో స్థానానికి పడేసింది.

India Stock Market | ఆసియా దేశాల హవా..

India Stock Market

ఆసియా స్టాక్ మార్కెట్లు (Asian Stock Markets) జోరు మీదున్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 7 దేశాల్లో ఆరు ఆసియాకు చెందినవే కావడం గమనార్హం. అమెరికా అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. చైనా, జపాన్, హాంగ్‌కాంగ్, తైవాన్‌లు తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. తాజాగా సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ ఆరో స్థానాన్ని ఆక్రమించింది. మన స్టాక్ మార్కెట్ ఏడో స్థానంలో ఉంది.

India Stock Market | ఏఐలో వెనకబాటుతో..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), సెమీకండక్టర్ల రంగాల్లో భారత్ వెనకబడింది. ఈ రంగాలలో పురోగతి సాధించిన దేశాల స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ షేర్ల వైపు పరుగులు తీస్తుండడంతో సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ విలువ 5.04 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో భారత మార్కెట్ విలువ 4.84 ట్రిలియన్ డాలర్లకు క్షీణించింది. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న సెమీ కండక్టర్, హార్డ్‌వేర్ ఏఐ బూమ్‌ను క్యాష్ చేసుకోవడంలో మన కంపెనీలు వెనకబడడమే ఇందుకు కారణం.

India Stock Market | ఆ రెండు కంపెనీల వల్లే..

India Stock Market

సౌత్ కొరియా మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం సెమీకండక్టర్ దిగ్గజాలు శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్. ఇవి రెండూ ఇప్పుడు ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరాయి. తైవాన్ మార్కెట్ ను టీఎసఎంసీ కంపెనీ నడిపిస్తుండగా.. కోస్పీని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ పరుగులు పెట్టిస్తున్నాయి. దక్షిణ కొరియా బెంచ్‌మార్క్ ఇండెక్స్ కోస్పి 2026 సంవత్సరంలో ఇప్పటివరకు 110 శాతానికిపైగా పెరగ్గా.. తైవాన్ 65 శాతానికి పైగా లాభపడింది. ఇదే సమయంలో భారత బెంచ్ మార్క్ సూచీలు 11 శాతానికిపైగా నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...