అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gurukul Tenders | కామారెడ్డి (Kamareddy) జిల్లా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (Social Welfare Schools) నిత్యావసర సరుకుల సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Gurukul Tenders | జిల్లాలో 12 గురుకులాలు..
జిల్లాలోని బాన్సువాడలో(Banswada), తాడ్వాయి, పెద్దకొడప్గల్, తాడ్వాయ్, ఎల్లారెడ్డి(Yellareddy), తాడ్వేల్, దోమకొండ, లింగంపేట్, కామారెడ్డి మున్సిపల్ డిగ్రీ కళాశాల, ఉప్పలవాయి, బిచ్కుంద, ఎల్లారెడ్డిపేట, దిష్టిపల్లి ఆచంపేట గురుకులాల్లో సరుకులు సరఫరా చేయాల్సి ఉంటుంది. కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్, పాలు, క్యాటరింగ్ సర్వీస్, స్వీపింగ్, పారిశుధ్య సేవలు, స్టేషనరీ సామగ్రి, ల్యాబ్ మెటీరియల్ ఉంటాయి.

Gurukul Tenders | టెండర్ షరతులు..
టెండర్ ఫారం రూ.1,000 ఉంటుంది. ఎస్బీఐ(SBI) సిరిసిల్ల రోడ్డు బ్రాంచ్, కామారెడ్డి, ప్రిన్సిపాల్ టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్/జేసీ(బాలుర) ఉప్పలవాయి పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది. దరఖాస్తుఫారాలు ఈనెల 13వ తేదీలోపు ఉప్పలవాయి టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్/జేసీ(బాలుర)లో తీసుకుని 13వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు సీల్ చేసి టెండర్ సమర్పించాల్సి ఉంటుంది. టెండర్లను ఈనెల 18న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో తెరుస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, మహిళలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. పూర్తి వివరాలకు టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ సీవో ఆఫీస్ కామారెడ్డి లేదా టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్/జేసీ(బాలుర) ఉప్పలవాయిలో సంప్రదించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: RBI Repo Rate | ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
