SI Extramarital Affair | హోంగార్డు భార్యతో ఎస్సై వివాహేతర సంబంధం.. మహిళ భర్త ఆరోపణ!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: SI Extramarital Affair | జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎస్సైపై హోంగార్డు సంచలన ఆరోపణలు చేశాడు. తన భారతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించాడు. తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడని.. తనకు నాయ్యం చేయాలని వేడుకుంటున్నాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా (Nizamabad District)లో చోటు చేసుకుంది.

బాధితుడి కథనం ప్రకారం.. బోధన్​ (Bodhan) డివిజన్​లోని ఓ మండల ​ఎస్సై తనను వేధిస్తున్నట్లు హోంగార్డు వీడియో విడుదల చేశాడు. మొదట్లో తాను ఎస్సై ఇంట్లో పని చేశానని చెప్పాడు. అయితే హోంగార్డు అయిన తనతో కాళ్లు ఒత్తించుకునేవాడని, ఇంటిపని, గిన్నెలు తోమడం వంటివి కూడా చేయించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ పని నచ్చకపోవడంతో మానేసినట్లు చెప్పాడు. అనంతరం తనపై ఎస్సై కక్ష పెంచుకొని స్టేషన్​లో నిత్యం వేధిస్తున్నాడని ఆరోపించాడు.

SI Extramarital Affair | న్యాయం చేయకపోతే చనిపోతా..

తన భార్యకు తనకు గొడవ జరిగితే పోలీస్​ స్టేషన్​కు వచ్చిందన్నారు. అయితే తనపై కక్ష గట్టిన ఎస్సై తన భార్యతో అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్సై తన భార్యతో ఆరు నెలలుగా వివాహేతర సంబంధం (Extramarital affair) పెట్టుకున్నాడని ఆరోపించాడు. తనను మానసికంగా వేధిస్తున్నాడని వాపోయాడు. తనకు కావాలని బందోబస్తు డ్యూటీలు వేస్తున్నారని చెప్పాడు. మేడారం, ఏడుపాయల జాతరకు పంపించారని చెప్పాడు. ఎస్సై భార్య లేని సమయంలో తన భార్యను ఇంటికి తీసుకు వెళ్తున్నాడని ఆరోపించాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వీడియో విడుదల చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి..: GGH Nizamabad | అరుదైన శస్త్రచికిత్సకు వేదికగా నిలిచిన నిజామాబాద్ జీజీహెచ్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *