Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Chandrasekhar Reddy Suspension | చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే గాంధీభవన్​లో దీక్ష

Shashi kiran Mottala
Last updated: June 5, 2026, 6:04 pm 6:04 pm
Shashi kiran Mottala
Share
Chandrasekhar Reddy Suspension

అక్షరటుడే, కామారెడ్డి : Chandrasekhar Reddy Suspension | టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే కామారెడ్డి (Kamareddy) నుంచి వెయ్యి మందితో గాంధీ భవన్​లో దీక్ష చేపడతామని కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు సంచలన ప్రకటన చేశారు. అవసరం అయితే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పేర్కొన్నారు.

Chandrasekhar Reddy Suspension | పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం..

Chandrasekhar Reddy Suspension

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (Congress Party Office)లో శుక్రవారం నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ వర్గ నేతలు మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవుల్లో కొనసాగిన వారు డబ్బులకు అమ్ముడు పోయారన్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతూ బీఆర్ఎస్ కోవర్టుగా పని చేస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఖతం కోసం ఆయన పని చేస్తున్నారన్నారు.

పార్టీని బ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్‌ (BRS)లో ఉన్నప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ను కొట్టినందుకు చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వారు గుర్తుచేశారు. నిజాయితీ కలిగిన షబ్బీర్ అలీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డిపై తాము చేసిన ఆరోపణలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

Chandrasekhar Reddy Suspension | గత అసెంబ్లీ ఎన్నికల్లో..

Chandrasekhar Reddy Suspension

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మెజారిటీ తగ్గడానికి చంద్రశేఖర్ రెడ్డి వర్గమే కారణమని ఆరోపించారు. ఆయనపై ఉన్న వ్యతిరేకతే మెజారిటీ తగ్గడానికి కారణమన్నారు. వారం రోజుల్లో చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే సీఎం, పీసీసీ చీఫ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌లను వెయ్యి మందితో వెళ్లి కలుస్తామని, పెద్దమొత్తంలో గాంధీభవన్‌లో ఆందోళన చేస్తామని, అప్పటికీ సస్పెండ్ చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పదవికి నాలుగు కోట్ల డీల్ జరిగిందన్న ప్రచారాన్ని ఖండిస్తూ అది అబద్ధమని కొట్టిపారేశారు.

కోవర్టులను లీడర్లను చేస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. 30 ఏళ్లుగా పార్టీలో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా పని చేస్తున్న వాళ్ళు పార్టీకి కావాలా..? మూడేళ్ల క్రితం వచ్చి పార్టీని భ్రష్టు పట్టించే వాళ్ళు కావాలా తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్, నాయకులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు పండ్ల రాజు, రాజాగౌడ్, నౌశిలాల్, గోనె శ్రీనివాస్, పాత రాజు, భీంరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: SI Extramarital Affair | హోంగార్డు భార్యతో ఎస్సై వివాహేతర సంబంధం..!

TAGGED:Chandrasekhar ReddyChandrasekhar Reddy SuspensionCongress PartyGandhi Bhavan ProtestKamareddy politicsShabbir AliTelangana Congresstelangana political newsTPCC News
Previous Article HYDRAA Land Operation HYDRAA Land Operation | కబ్జాదారులకు షాక్.. రూ. 30,000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
Next Article CMR Green IPO CMR Green IPO | ఐపీవోకు భారీ డిమాండ్.. 127 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన ‘సీఎంఆర్’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Mahesh Kumar Goud
హైదరాబాద్

Mahesh Kumar Goud | రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మళ్లీ అధికారంలోకి వస్తాం: పీసీసీ చీఫ్

By Shivam nagarani
Alumni Meet Bodhan |
నిజామాబాద్

Alumni Meet Bodhan | ఆత్మీయ పలకరింపులు.. గత జ్ఞాపకాల పున:స్మరణాలు.. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

By Shashi kiran Mottala
Navsari POCSO Case
నిజామాబాద్

Kamareddy Fast Track Court | బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

By Shashi kiran Mottala
RTC Recruitment
నిజామాబాద్

RTC Recruitment | ఆర్టీసీలో తాత్కాలిక పద్ధతిలో కండక్లర్లు, డ్రైవర్ల నియామకం

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.