అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy HYDRAA | హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైడ్రా అనేది హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని హైడ్రా ఏర్పాటు చేశామన్నారు.
దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారిని (IPS officer) కమిషనర్‌గా నియమించి.. ఆయనకు మూడు వేల మంది సిబ్బందిని ఇచ్చామన్నారు. ఇందులో రిటైర్డ్ ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారని చెప్పారు. దీంతో నేడు హైదరాబాద్‌లో ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడుతున్నారని తెలిపారు. బెంగళూరులో జరిగిన ది హిందూ హడిల్ కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు.
కేసీఆర్ (KCR)కు వ్యతిరేకంగా బలమైన పోరాటం కావాలని ప్రజలు భావించారని రేవంత్‌రెడ్డి అన్నారు. దాంతో తాను టీడీపీకి రాజీనామా చేశానన్నారు. ఆ సమయంలో తన ఎదుట ఎన్నో మార్గాలున్నాయని చెప్పారు. తాను కాంగ్రెస్‌ను ఎంచుకున్నాని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరానని తెలపారు.
Revanth Reddy HYDRAA | బయట స్నేహితులు లేరు

రాజకీయ నాయకులు తప్ప తనకు బయట స్నేహితులు లేరని రేవంత్‌రెడ్డి తెలిపారు. తనకు ఫుట్‌బాల్ అంటే ఇష్టమని, అందుకే మెస్సీని హైదరాబాద్ (Hyderabad)కు ఆహ్వానించానని పేర్కొన్నారు. వచ్చే ఫిఫా వరల్డ్ కప్‌ను తప్పకుండా చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జులై 4తో ప్రజా జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా, ప్రజా మద్దతుతోనే సాధారణ రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరానన్నారు.
Revanth Reddy HYDRAA | విద్యార్థులకు ఉచిత బస్సు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎం గుడ్‌న్యూస్ చెపపారు. బడి పిల్లలకు త్వరలో ఉచిత బస్సు సౌకర్యం, అవసరమైన చోట పేద విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి క్లాసులో 30 మంది ఉండేలా స్కూళ్లను రేషనలైజ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
Revanth Reddy HYDRAA | వారికి జీరో టాక్స్
తెలంగాణలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొంటున్న వారికి జీరో ట్యాక్స్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రతి ఏటా రూ. 1500-2000 కోట్ల మేర నష్టం వస్తోందన్నారు. తాను రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తా, నాకు రాజకీయాలు మినహా మరే ఇతర వ్యాపకాలు లేవని వెల్లడించారు.
Revanth Reddy HYDRAA | త్వరలో నోటిఫికేషన్
రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదని సీఎం (CM Revanth Reddy) ఆరోపించారు. గతంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారని విమర్శించారు. ఆయన గ్రూప్-1 అభ్యర్థులన ఇంటర్వ్యూ చేస్తారన్నారు. ఇంజినీరు, డాక్టర్, ఇతర నియామకాలు చేసే వ్యక్తి ఓ ఆర్ఎంపీ డాక్టరా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామన్నారు. 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. త్వరలో మరో 5 వేల పోలీసు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: Waqf Board Inspector Bribe | ఏసీబీకి చిక్కిన వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్
