అక్షరటుడే, ఆర్మూర్: House Arson | అప్పిచ్చి తిరిగి చెల్లించాలని అడిగినందుకు రుణదాత ఇంటికి నిప్పంటించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆర్మూర్ పోలీస్స్టేషన్లో(Armoor Police) ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ వివరాలు వెల్లడించారు.
House Arson | ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన అబ్దుల్ బారి డిచ్పల్లి (Dichpally) తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) పీహెచ్డీ చదువుతున్నాడు. గ్రామానికి చెందిన రాజమల్లు దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు.
అయితే తీసుకున్న అప్పు తిరిగిచ్చిన బారీ వడ్డీ కోసం చెక్కు రాసిచ్చాడు. ఎనిమిది నెలల తర్వాత డ్రా చేసుకోవాలని చెప్పగా.. అత్యవసర పరిస్థితుల్లో రాజమల్లు వడ్డీ డ్రా చేసుకున్నాడు. దీంతో కోపగించుకున్న బారీ.. రాజమల్లు ఇంటికి నిప్పంటించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో తన అన్న ఇంటి వద్ద ఉన్న అబ్దుల్ బారిని శనివారం అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు.

ఇది కూడా చదవండి: Suvendu Adhikari Bengal | ‘మార్పు’ దిశగా బెంగాల్ అడుగులు.. సీఎం సువేందు భవిష్యత్ వ్యూహం ఏమిటంటే..!
