MLA Dhanpal | తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దు: ఎమ్మెల్యే ధన్​పాల్​

చదువు విషయంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు. శాలివాహన (కుమ్మర) ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేడ్కర్​ భవన్​లో విద్యార్థులకు ‘విద్య శిరోమణి’ అవార్డులను అందజేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | చదువు విషయంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని అర్బన్ (Nizamabad Urban) ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు. శాలివాహన (కుమ్మర) ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేడ్కర్​ భవన్​లో విద్యార్థులకు ‘విద్య శిరోమణి’ అవార్డులను ( student awards) అందజేశారు.

MLA Dhanpal | ఉన్నతమైన లక్ష్యంతో ముందుకెళ్లాలి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదో తరగతి(థథఢ), ఇంటర్మీడియట్​లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు (academic success) తెలిపారు. భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాకు దేశానికి మంచి పేరు తేవాలని చెప్పారు. విద్యను ఎవరు దొంగిలించే అవకాశం లేదని, విద్యతోనే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చన్నారు. ప్రధానంగా ప్రతి విద్యార్థి స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ఫోన్లతో మంచి ఎంతో చెడు కూడా అంతకు రెట్టింపు ఉంటుందన్నారు. కుమ్మర కులస్తులు రాజకీయంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

MLA Dhanpal | తెలంగాణలో అధికారంలోకి బీజేపీ..

తెలంగాణలో బీజేపీ(Telangana BJP) అధికారంలోకి వస్తుందని, శాలివాహన కులస్తులకు ప్రత్యేక గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కుమ్మర ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ భూపతి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సాయికుమార్, జిల్లా గౌరవాధ్యక్షుడు కనకం గంగాధర్, సంఘ సభ్యులు హన్మాండ్లు విసిగిరి గంగారం, ఆర్ కే ప్రజాపతి, సిర్పూరు చిన్నయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు చందూర్ బాబు, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీ నారాయణ, బీజేపీ నాయకులు పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.

dhan11

ఇది కూడా చదవండి : Telangana School Reopening | విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ వాయిదా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *