అక్షరటుడే, వెబ్డెస్క్: Air India Aircraft Damage | ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi International Airport) టెర్మినల్ 2లో ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలను గ్రౌండ్ సపోర్టు పరికరాలు ఢీకొన్నాయి. దీంతో అవి ధ్వంసం అయ్యాయి.
ఢిల్లీలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురిసింది. ఎయిర్పోర్టులో గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు విమానాలను ఢీకొన్నాయి. దీంతో అవి స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం తర్వాత ఆ మూడు విమానాలను సేవలకు దూరంగా ఉంచినట్లు విమానాశ్రయ నిర్వాహకులు తెలిపారు.
Air India Aircraft Damage | వాతావరణ మార్పులతో..
అకస్మాత్తుగా మారిన ప్రతికూల వాతావరణం కారణంగా ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్, ఇండిగో (Indigo)కు చెందిన గ్రౌండ్ పరికరాలు నిలిపి ఉంచిన విమానాలను ఢీకొట్టాయి. వాతావరణంలో మార్పుల గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదని ప్రైవేట్ ఆపరేటర్ చెప్పారు. ప్రతికూల వాతావరణంతో ఇతర ఆపరేటర్ల విమానాలు కూడా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. ధ్వంసమైన మూడు విమానాల్లో రెండు త్వరలో తిరిగి సేవల్లోకి వస్తాయని, మూడో దాని మరమ్మతులకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Tamil Nadu Politics | టీవీకే ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?: స్టాలిన్ హాట్ కామెంట్స్
