Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్​కు కిషన్​రెడ్డి కౌంటర్​

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. సింగరేణి విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్​ ఇచ్చారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishan Reddy Counter | సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ.. గతంలో బీఆర్ఎస్ గానీ, ఇప్పుడు కాంగ్రెస్ గానీ ఏ విషయంలోనూ కేంద్రాన్ని సంప్రదించలేదని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ఇప్పుడు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కుమ్మక్కు అయ్యానంటూ తనపై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్​కు కౌంటర్​ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ వస్తే కూడా సింగరేణి నిధులు ఖర్చు చేశారని, ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు కూడా సింగరేణి డబ్బులు పెడుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని ఫిల్మ్‌నగర్ ఎఫ్ఎన్‌సీసీ (FNCC)లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బొగ్గు రంగం అంటే అవినీతి, స్కామ్​లకు కేరాఫ్​ అడ్రస్​గా ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కోల్​ సెక్టార్​లో అనేక మార్పులు తెచ్చినట్లు తెలిపారు.

Kishan Reddy Counter | అనేక సంస్కరణలు

మోదీ (Modi) పాలనలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని కిషన్​రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్​ కేంద్రాల ద్వారా 70 శాతానికి పైగా విద్యుత్​ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రస్తుతం దేశ అవసరాల మేరకు బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్​ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. బొగ్గు విద్యుత్​తో పాటు అనేక రంగాలకు అవసరం అన్నారు. బొగ్గు దిగుమతులను తగ్గించామన్నారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న బొగ్గు రంగంలోకి ప్రైవేట్​ సెక్టార్​ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా బొగ్గు గనులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

Kishan Reddy Counter | క్రిటికల్​ మినరల్స్​ కోసం..

Kishan Reddy Counter

స్టీల్ ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. సిమెంట్​ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్నామని వెల్లడించారు. క్రిటికల్​ (రేర్​) మినరల్​లో మనం వెనకబడి ఉన్నామని చెప్పారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. 90 శాతం క్రిటికల్​ మినరల్స్​ను భారత్ దిగుమతి చేసుకుంటుందన్నారు. సెమి కండక్టర్లు, ఎలక్ట్రిక్​, ఆటో మొబైల్​ రంగాల్లో వీటి పాత్ర కీలకమన్నారు. దీంతో నేషనల్ క్రిటికల్​ మినరల్స్​ మిషన్​ ప్రారంభించామన్నారు. దీనికి మొదటి విడతగా ప్రభుత్వం రూ.32 వేల కోట్లు కేటాయించిందన్నారు.

ఇది కూడా చదవండి..: Rahul Ramakrishna Tweets | డిప్యూటీ సీఎం పవన్‌పై టాలీవుడ్ కమెడియన్ ప్రశ్నల వర్షం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *