Fertilizer Price Hike | పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రాస్తారోకో..

పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షర టుడే నిజామాబాద్ అర్బన్: Fertilizer Price Hike | పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఎంఎల్ మాస్​లైన్ ప్రజాపంథా అనుబంధ అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.

Fertilizer Price Hike | స్వామినాథన్​ కమిషన్​ సిఫార్సులకు లోబడి..

ఈ మేరకు అఖిలభారత ఐక్య వైద్య సంఘం (ఏఐయుకేఎస్)రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవారం మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు లోబడి ఎంఎస్​పీ గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంట్​లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఎగుమతి సుంకాలను పెంచి దిగుమతి సుంకాలను పూర్తిగా రద్దు చేయడంతో దేశ వ్యవసాయ రంగం సంక్షోభానికి గురవుతుందన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, పప్పు దినుసులు, డైరీ ఉత్పత్తుల రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు.

Fertilizer Price Hike | యూరియా యాప్​తో అనేక కష్టాలు..

అమెరికాలో రైతాంగానికి భారీ సబ్సిడీలు ఇచ్చి ఆదుకుంటుందని కానీ భారతదేశంలో సబ్సిడీల ఊసేలేదని వారు పేర్కొన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచడంతో రైతన్న నడ్డి విరుగుతోందని.. వెంటనే కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు ధరలను తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కొత్తగా ఎరువులు కొనుగోలు చేసేందుకు యాప్​ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దాంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పినప్పటికీ పట్టించుకోవట్లేదన్నారు. వెంటనే యాప్​ను తొలగించి రైతులకు నేరుగా ఎరువులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి బాబన్న మాట్లాడగా, ఉపాధ్యక్షుడు రాజన్న, ఏపీ గంగారాం, సహాయ కార్యదర్శులు దామోదర్, కిషన్, నాయకులు సాయిలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ganesh Bigala | గణేష్ బిగాలను పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *