Stock Market Today | ప్రారంభ లాభాలు ఆవిరి.. స్వల్ప లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 52 పాయింట్లు, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | విదేశీ నిధుల నిరంతర తరలింపుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బెంచ్ మార్క్ సూచీలు ప్రారంభ లాభాలను కోల్పోయాయి. మార్కెట్‌లో ఒడిదుడుకులకు నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యమూ ఒక కారణంగా భావిస్తున్నారు.

Stock Market Today | వృద్ధి అంచనాను తగ్గించిన ఫిచ్..

సెప్టెంబర్ మరియు డిసెంబర్ త్రైమాసికాలలో ఆర్థిక కార్యకలాపాలపై అమెరికా -ఇరాన్ యుద్ధం ప్రభావాన్ని ఉటంకిస్తూ ఫిచ్ రేటింగ్స్ సంస్థ ఎఫ్ వై 27కి మన జీడీపీ వృద్ధి అంచనాను 6.7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. మూలధన వ్యయం పటిష్టంగా ఉన్నప్పటికీ అధిక ధరలు వాస్తవ ఆదాయాలు, వినియోగదారుల వ్యయంపై భారం మోపడం వల్ల వృద్ధి తగ్గుతుందని సదరు ఏజెన్సీ అంచనా వేసింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఒత్తిడికి గురయ్యాయి.

Stock Market Today | భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 511 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 525 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 136 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అమ్మకాల ఒత్తిడికి గురై 130 10 పాయింట్లు తగ్గింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 52 పాయింట్ల నష్టంతో 73,575 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 23,150 వద్ద ఉన్నాయి.

Stock Market Today | ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్‌లో మద్దతు..

ఆటో, బ్యాంకింగ్ రంగాలలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఆటో ఇండెక్స్ 1.16 శాతం, రియాలిటీ 0.97 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.93 శాతం, ఫార్మా 0.84 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.68 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.60 శాతం లాభంతో ఉండగా.. యుటిలిలీ 0.79 శాతం, ఐటీ 0.59 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 15 స్టాక్స్ లాభాలతో, 15 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో 1.83 శాతం, ఎంఅండ్ ఎం 1.65 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ .91 శాతం, ట్రెంట్ 0.86 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.94 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎన్టీపీసీ 1.63 శాతం, టైటాన్ 1.52 శాతం, ఎటర్నల్ 1.49 శాతం, పవర్‌గ్రిడ్ 1.31 శాతం, టెక్ మహీంద్రా 1.13 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Innova Crysta 2026 | కొత్త హంగులతో ఇన్నోవా క్రిస్టా రీలాంచ్..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *