అక్షరటుడే, వెబ్డెస్క్: Khammam Theft | ఖమ్మం జిల్లా (Khammam District) కేంద్రంలో భారీ చోరీ జరిగింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షోరూం సోనోవిజన్లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన ఐఫోన్లను ఎత్తుకెళ్లారు.
నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ షోరూం ‘సోనో విజన్’లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. షోరూం తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన నిందితులు అక్కడ ఉన్న ఫోన్లను చోరీ చేశారు. గురువారం ఉదయం షోరూం తెరిచిన సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Khammam Theft | నిందితుల కోసం గాలింపు

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో రద్దీగా ఉండే వైరా రోడ్డులో భారీ చోరీ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
Khammam Theft | అంతర్రాష్ట్ర దొంగల పనేనా
నిందితులు కారులో వచ్చి లూటీ చేశారు. స్టాక్ వచ్చిన కొన్ని గంటల్లోనే దోపిడీ జరగడంపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రాంతాన్ని సీపీ సునీల్ దత్ (CP Sunil Dutt) పరిశీలించారు. అంతర్రాష్ట్ర దొంగలుగా ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. ఖమ్మం సరిహద్దులలో పోలీసుల అలర్ట్ అయ్యారు.
ఇది కూడా చదవండి..: Andhra Liquor Scam | తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు