Hyderabad Road Accident | రోడ్డుపై మహిళ మృతదేహం.. అధికారులపై స్థానికుల ఆగ్రహం

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. శేరిలింగంపల్లి పరిధిలోని మదినగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Road Accident | రోడ్డు ప్రమాదం (Road Accident)లో మహిళ మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని తరలించడంతో పోలీసులు నిర్లక్ష్యం చేశారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ (Hyderabad) శేరిలింగంపల్లి పరిధిలోని మదినగూడలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో మహిళ చనిపోయింది. అయితే ఆమె మృతదేహం 35 నిమిషాల పాటు నడిరోడ్డుపైనే ఉంది. ఆ తర్వాత అంబులెన్స్​లో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే మృతదేహాన్ని అలా రోడ్డుపై ఉంచడంపై స్థానికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad Road Accident | ఎదురెదురుగా ఢీకొన్నకార్లు

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మంచాల మండలం ఆగపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ హైవేపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇది కూడా చదవండి..: Jupally Krishna Rao | గంజాయి రవాణాపై కఠిన చర్యలు : మంత్రి జూపల్లి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *