అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oman Ship Attack | ఒమన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పట్నాల ఉన్నట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు కూడా సురేష్ పట్నాల మృతిని నిర్ధారించినట్లు తెలిసింది. సముద్ర రవాణా రంగంలో సేవలందిస్తున్న సురేష్ పట్నాల విధి నిర్వహణలో భాగంగా ఆ నౌకలో పనిచేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
Oman Ship Attack | శోకచ్ఛాయలు
సురేష్ పట్నాలకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్వస్థలమైన విశాఖపట్నంలోనూ శోకచ్ఛాయలు అలుముకున్నాయి.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ విషాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!
