Revanth Reddy | పవన్​ కల్యాణ్​ తెలంగాణలో పోటీ చేయొచ్చు : సీఎం రేవంత్​రెడ్డి

పవన్​ కల్యాణ్​​ తెలంగాణలో పోటీ చేయొచ్చని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy | ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యవహారంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ (Pavan Kalyan) ప్రశ్నలు వేశారు.. పొన్నం ప్రభాకర్‌ సమాధానం చెప్పారన్నారు.

శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పవన్‌ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సీఎం తెలిపారు. ఇటీవల తెలంగాణలో పవన్​ సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా ఢిల్లీలో మీడియా చిట్​చాట్​లో రేవంత్​రెడ్డి స్పందించారు. ఏపీలో జగన్‌ (YS Jagan) సభలకు, ర్యాలీలకు కూడా కొన్నిసార్లు అనుమతులు ఇవ్వరని చెప్పారు. పవన్‌ తెలంగాణకు రావచ్చు.. పోవచ్చు అన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసుకోవచ్చని తెలిపారు.

Revanth Reddy | బీజేపీపై ఫైర్​

బీజేపీ నేతలు కిమ్ జోంగ్ ఉన్ మార్గంలో నడుస్తున్నారని సీఎం విమర్శించారు. అప్పట్లో ఓటు చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్​ నామినేషన్​ తిరస్కరించడాన్ని ఆయన ఖండించారు. రిటర్నింగ్ అధికారి బీజేపీకి తొత్తుగా మారి కుట్ర చేశారని వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ విషయంలో నితిన్ నబిన్, రిటర్నింగ్ అధికారిని వదిలేది లేదన్నారు. నటరాజన్‌పై తెలంగాణలో అసలు కేసే లేదని స్పష్టం చేశారు.

Revanth Reddy | అడ్డుపడుతున్న కిషన్​రెడ్డి

revanth reddy 2

కేటీఆర్ ఆదేశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో పాటిస్తున్నారంటూ సీఎం ఆరోపించారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల కాకపోవడానికి, చివరకు రీజినల్ రింగ్ రోడ్డుకు కూడా కిషన్ రెడ్డే అడ్డుపడ్డారన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్కసారైనా ప్రధానితో చర్చించారా అని ప్రశ్నించారు. ఇటీవల హిట్లర్​ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేశానని రేవంత్​ వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. హిట్లర్ తనకు ఆదర్శమని తానెప్పుడూ చెప్పలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటారా అన్నారు.

దీనిని కూడా చదవండి : Singareni Medical Board | సింగరేణి ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. త్వరలో మెడికల్ బోర్డు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *