Illegal Gender Tests | వనస్థలిపురంలో లింగ నిర్ధారణ దందా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్

అక్రమంగా శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు ‘డెకాయ్‌ ఆపరేషన్’ ద్వారా ఛేదించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Illegal Gender Tests |రంగారెడ్డి జిల్లా ( rangareddy ) వనస్థలిపురంలో  అక్రమంగా శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు ‘డెకాయ్‌ ఆపరేషన్’ ద్వారా ఛేదించారు. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Illegal Gender Tests | అక్రమ దందా..

పోలీసుల కథనం ప్రకారం.. హయగ్రీవ ఆస్పత్రి డైరెక్టర్ కొర్ర రాజు, అక్కడి రిసెప్షనిస్ట్ లోకేశ్, తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్‌కుమార్ కలిసి ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. గర్భంలోని శిశువు ఆడో, మగో నిర్ధారించి చెబుతామంటూ ఆస్పత్రికి వచ్చే బాధితులను నమ్మిస్తున్నారు. ఆ తర్వాత, తమకు తెలిసిన వ్యక్తి ద్వారా స్కానింగ్ చేయిస్తామంటూ బాధితులను తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్‌కు పంపిస్తున్నారు.

Illegal Gender Tests | పోలీసుల మెరుపు దాడి..

ఈ ముఠాపై నమ్మదగ్గ సమాచారం అందుకున్న పోలీసులు, డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి అసలు రంగును బయటపెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని, శ్రీ సాయి ధనుష్ క్లినిక్‌పై దాడి చేశారు. నిందితులపై పీసీపీఎన్​డీటీ (PCPNDT) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వనస్థలిపురం సీఐ రవిబాబు తెలిపారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Illegal Gender Tests | స్థానికుల డిమాండ్..

ఈ దారుణానికి పాల్పడిన ఆస్పత్రులను సీజ్ చేయడంతో పాటు, బాధ్యులైన వైద్యుల లైసెన్స్‌లను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కేసులతో సరిపెట్టకుండా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Prakash Raj Dharmasthala | ధర్మస్థల వివాదం.. రిట్ పిటిషన్‌లో ప్రకాశ్‌రాజ్ పేరు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *