Jnaneshwari Missing Case | చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో వారం క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jnaneshwari Missing Case | కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఆదేశించారు. జిల్లా ఎస్పీతో సమీక్షించిన ఆయన.. డ్రోన్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను, అటవీ నిపుణులను రంగంలోకి దించి అడవుల్లో జల్లెడ పట్టాలన్నారు.

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలో యాభై ఎకరాల పామాయిల్ తోటలో కాపలాదారులుగా పని చేస్తున్న గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి గత శనివారం అదృశ్యం అయిన విషయం తెలిసిందే. పెంపుడు కుక్కతో కలిసి వెళ్లిన జాను తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ దొరకడం లేదు. అధికారులు, స్థానికులు అటవీ ప్రాంతంలో వెతుకుతున్నా.. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆమె వెంట వెళ్లిన కుక్కకు జీపీఎస్​ ట్రాకర్​ అమర్చిన ఎలాంటి ప్రయోజనం లభించలేదు. శనివారం ఆ కుక్క చనిపోయింది.

Jnaneshwari Missing Case | 400 మంది సిబ్బందితో..

చిన్నారి జాను కోసం పోలీసులు, అటవీ శాఖ అధికారులు, స్థానికులు అడవుల్లో జల్లెడ పడుతున్నారు. డ్రోన్​ల సాయంతో ఆమె జాడ కనిపెట్టేందుకు యత్నిస్తున్నారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వారు సైతం ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ ఎస్పీతో మాట్లాడారు. జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినిగియోగించుకోవాలని తెలిపారు. దీంతో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సైతం ఆదివారం నుంచి గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి.

Jnaneshwari Missing Case | వారి సేవలు వినియోగించుకోవాలి

దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్ , ఎక్స్ పర్ట్స్ సహాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని పవన్​ సూచించారు. చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు ఇప్పటికే 400 మందికిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్టు, అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నట్టు ఎస్పీ వివరించారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Reservoir Inflows | హైదరాబాద్​వాసులకు అలర్ట్​.. జంట జలాశయాలకు వరద ప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *