అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 16 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా పసిడి ధరలు నిలకడగా కొనసాగుతూనే భారీ గరిష్టాల వైపు పయనిస్తున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో నేడు 24 క్యారెట్ల (99.9% స్వచ్ఛత) బంగారం ధర గ్రాముకు ₹15,154 పలుకుతుండగా, వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల (91.6% స్వచ్ఛత) ఆర్నమెంట్ బంగారం ధర గ్రాముకు ₹13,891 వద్ద స్థిరంగా ఉంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹11,366 గా నమోదైంది.
గ్లోబల్ మార్కెట్లలో ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, మారుతున్న వడ్డీ రేట్లతో పాటు వెండి ధరల్లో కదలికలు స్థానిక మార్కెట్లో పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
June 16 Gold Prices | ఐబీజేఏ (IBJA) బెంచ్‌మార్క్ ధరలు
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసిన అధికారిక బెంచ్‌మార్క్ ధరల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రామాణిక రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- 24 క్యారెట్ (999 బంగారం): 10 గ్రాములకు ₹1,50,646 (గ్రాముకు ₹15,064)
- 22 క్యారెట్ (916 బంగారం): 10 గ్రాములకు ₹1,37,992 (గ్రాముకు ₹13,799)
- 18 క్యారెట్ (750 బంగారం): 10 గ్రాములకు ₹1,12,985 (గ్రాముకు ₹11,298)
IAS Gandham Chandrudu Story | రూ.ఐదు ‘లంచం’.. ఎండిన డొక్క.. ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడి ‘సర్టిఫికెట్ కథ’!
June 16 Gold Prices | ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లలో నేటి ధరలు (10 గ్రాములకు)
దేశంలోని టాప్ జ్యువెలరీ బ్రాండ్స్ తమ షోరూమ్‌లలో నిర్ణయించిన ధరల పట్టికను ఇక్కడ చూడవచ్చు:
- జ్యువెలరీ సంస్థ : – 22 క్యారెట్ల ధర (10 గ్రాములకు) – 24 క్యారెట్ల ధర (10 గ్రాములకు) – 18 క్యారెట్ల ధర (10 గ్రాములకు)
- తనీష్క్ (Tanishq) : – ₹1,39,350 – ₹1,52,020 – ₹1,14,010
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ : – ₹1,38,900 – ₹1,51,530
- జోయాలుక్కాస్ (Joyalukkas) : – ₹1,38,900 – ₹1,51,530 – ₹1,13,650
- భీమా జ్యువెలర్స్ : – ₹1,37,890 (అత్యంత తక్కువ) – ₹1,51,600 – ₹1,12,690
- కళ్యాణ్ జ్యువెలర్స్ : – ₹1,38,900
- జోస్ ఆలుక్కాస్ (Jos Alukkas) : – ₹1,38,900 – ₹1,51,580 – ₹1,14,750
భీమా జ్యువెలర్స్‌లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర మిగతా ప్రముఖ బ్రాండ్లతో పోలిస్తే అత్యంత పోటీ ధరతో (గ్రాముకు ₹13,789) లభిస్తోంది. ఇక కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ సంస్థలు హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో ఒకే విధమైన ధరలను అమలు చేస్తున్నాయి.
June 16 Gold Prices | పసిడి ధరలు ఇంతలా పెరగడానికి కారణమేంటి?
ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ అణు ఒప్పందానికి సంబంధించిన శాంతి చర్చలు స్విట్జర్లాండ్‌లో ముగింపు దశకు చేరుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఈ పరిణామాలపై ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) ప్రెసిడెంట్, రిద్ధిసిద్ధి బులియన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారి మాట్లాడుతూ.. “అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద ప్రక్రియతో ముడిచమురు ధరలు 4% పైగా క్షీణించాయి, డాలర్ ఇండెక్స్ కూడా 10 రోజుల కనిష్టానికి పడిపోయింది. దీనివల్ల రాబోయే యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు 69% నుంచి 48% కి తగ్గాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో బంగారం $4,330 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. దీనికి ఎగువన $4,500 – $4,550 వద్ద నిరోధం (Resistance), దిగువన $4,242 వద్ద మద్దతు (Support) లభిస్తోంది. అలాగే అంతర్జాతీయ వెండి ధరలు $70 మార్కును దాటి $72 – $75 వైపు దూసుకెళ్తున్నాయి. ఈ వారంలో జరగబోయే ఎఫ్‌ఓఎమ్‌సీ (FOMC) సమావేశం నేపథ్యంలో పసిడి మార్కెట్ పాజిటివ్ ట్రెండ్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది” అని విశ్లేషించారు.