అక్షరటుడే, మెండోరా: Urea App Protest | యూరియా యాప్‌ను రద్దు చేయాలని బీఆర్ఎస్నాయకులు రాస్తారాకో చేశారు. మెండోరా మండలం (Mendora Mandal) పోచంపాడ్ ఎక్స్‌రోడ్డు వద్ద రైతులతో కలిసి వారు ఈ కార్యక్రమం నిర్వహించారు.
Urea App Protest | యాప్‌తో అనేక ఇబ్బందులు..
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. యూరియా పంపిణీకి అమలు చేస్తున్న యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సహకార సంఘాల ద్వారా నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. యాప్ విధానం కారణంగా స్మార్ట్‌ఫోన్ లేని మహిళలు, వృద్ధ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యాప్ ద్వారా కాకుండా పాత విధానంలోనే యూరియాను సొసైటీలకు పంపిస్తే రైతులు నేరుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే యూరియా యాప్‌ను ఎత్తివేయాలని, లేకపోతే పెద్దఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మిస్బావద్దీన్, ఉప సర్పంచ్ సంపంగి సతీష్, మండల మార్కెట్ కమిటీ నాయకుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ ఎల్కటూరు గంగారెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Manala Mohan Reddy | ఎంపీ అర్వింద్ నోరు అదుపులో పెట్టుకోవాలి..: మానాల మోహన్‌రెడ్డి