అక్షరటుడే, కామారెడ్డి: Railway Track Death | గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి దుర్మరణం చెందాడు. ఈ ఘటన భిక్కనూర్ రైల్వేస్టేషన్ (Bhikkhunur Railway Station) శివారులో చోటుచేసుకుంది.
Railway Track Death | భిక్కనూరు రైల్వేస్టేషన్ శివారులో..
రైల్వే పోలీసులు (Railway Police) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి భిక్కనూర్ రైల్వేస్టేషన్ కేఎం నెంబర్ 531/13-14 మధ్య రైల్వే ట్రాక్‌పై సుమారు 35 నుండి 45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే గుర్తుతెలియని రైలు కింద పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు మృతుని తల, ముఖం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో గుర్తుపట్టడం కష్టంగా మారిందన్నారు. మృతుడి ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు, నలుపు రంగు ప్యాంటు, నలుపు రంగు బెల్టు, నీలం రంగు బనియన్, నీలం రంగు చినిగిన టీ షర్టు కలిగి ఉన్నాడని, బ్రౌన్ కలర్ చెప్పులు వేసుకుని ఉన్నాడని తెలిపారు. మృతుని వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లభించలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలు తెలిసిన వారు, బంధువులు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే ఎస్సై సాధు లింబాద్రిని సెల్ నెంబర్ 8712658614 లో సంప్రదించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Urea App Protest | యూరియా యాప్ రద్దు చేయాలని రాస్తారోకో..