SP Rajesh Chandra | నేర చరిత్ర కలిగిన వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి: ఎస్పీ రాజేష్ చంద్ర

నేర చరిత్ర కలిగిన వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | నేర చరిత్ర కలిగిన వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఆయన భిక్కనూరు పోలీస్ స్టేషన్‌ (Bhikkhunur Police Station)ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై రోల్ కాల్ ప్రాముఖ్యత, విధులు, బాధ్యతలపై పలు సూచనలు చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన ఆర్థిక నేరాలు, దొంగతనాలు, ఇతర కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

SP Rajesh Chandra | పెండింగ్​ కేసులను పరిష్కరించాలి

పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేక కార్యాచరణతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేయాలని, పగలు, రాత్రి గస్తీని పెంచాలని సూచించారు. వాహనాల తనిఖీలు, నాకాబందీలు నిర్వహిస్తూ అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు భద్రత అంశాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భిక్కనూరు ఎస్‌హెచ్‌వోకు సూచించారు.

SP Rajesh Chandra | పోలీసులపై విశ్వాసం పెరిగేలా..

గ్రామాలు, కాలనీల్లో ప్రజలతో మమేకమవుతూ పోలీసులపై విశ్వాసం పెంపొందించేలా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధత, వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఓపికగా విని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

SP Rajesh Chandraఇది కూడా చదవండి..: DCC Nizamabad | సీఎం, మంత్రులు అవినీతిపై ఆధారాలు చూపే దమ్ము అర్వింద్​కు ఉందా..?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *