Nutritious Meals | మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని నిజామాబాద్​ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు.

Shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ : Nutritious Meals | ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. డిచ్​పల్లి (Dichpally) మండలంలోని సుద్దపల్లి సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను మంగళవారం సందర్శించారు.

Nutritious Meals | భోజనాల తనిఖీ..

పాఠశాలలో సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసిన కలెక్టర్​ అనంతరం కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాల్​లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. పుస్తకాలు, నోట్ బుక్కులు పూర్తి స్థాయిలో వచ్చాయా అని ఆరా తీశారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల (Midday Meal Scheme) నాణ్యతను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాలతో పాటు కిచెన్, డైనింగ్ హాల్​లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు వస్తేనే వారితో పంపాలని సూచించారు. ఎక్కువ రోజుల పాటు పాఠశాలకు హాజరు కాని విద్యార్థినులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు ఎందుకు పాఠశాలకు రావడం లేదనే విషయాన్ని ఆరా తీయాలన్నారు.

Nutritious Meals | పాఠశాలల్లో పెండింగ్​ పనులు..

పాఠశాలలో పెండింగ్ పనుల వివరాలను కలెక్టర్​ అడిగి తెలుసుకున్నారు. డ్రెయినేజీ పనులను తక్షణమే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం సెకండియర్ క్లాస్ రూమ్​కు వెళ్లి విద్యార్థినులకు పలు సబ్జెక్టులలో ప్రశ్నలు వేస్తూ, సమాధానాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్ స్వప్న, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

12 2

ఇది కూడా చదవండి : Monsoon Preparedness | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ సీవీ ఆనంద్

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *