Adilabad Airport | ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్​కు వేగంగా అడుగులు

ఆదిలాబాద్​ ఎయిర్ పోర్టు కోసం భూసేకరణ ప్రక్రియను పారదర్శకతతో చేపడతామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Adilabad Airport | ఆదిలాబాద్​ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియను పారదర్శకతతో చేపడతామని కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) తెలిపారు. మంగళవారం ఎంపీ గోడం నగేష్ (MP Nagesh), ఎమ్మెల్యే పాయల శంకర్, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, రాష్ట్ర సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చర్యలను వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, అదనంగా డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్) కోసం 1,500 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలను కేటాయించేందుకు ప్రాథమిక ఆమోదం లభించిందన్నారు.

Adilabad Airport | రక్షణశాఖకు అప్పగిస్తాం

భూసేకరణ పూర్తి చేసి రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీకి భూములను అప్పగిస్తామని కలెక్టర్​ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు సివిల్ ఏవియేషన్‌తో పాటు డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన లొకేషన్ల పరిశీలన విజయవంతంగా పూర్తయిందని ఎంపీ గోడం నగేష్ తెలిపారు. గత మార్చిలో ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డిలతో ఈ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించామని, మే 15న కేంద్ర ఉన్నతస్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా నిర్వహించిందని గుర్తుచేశారు.

Adilabad Airport | కల నెరవేరబోతోంది

జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై నేటి సమావేశంతో స్పష్టత వచ్చిందని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం 1,840 ఎకరాలు అవసరమవుతాయని, ఇందులో 1,500 ఎకరాలను రక్షణ శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోందని, జిల్లా అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

దీనిని కూడా చదవండి : Farmer Loan Waiver | రైతులకు రుణమాఫీ.. తమిళనాడు సీఎం సంచలన ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *