అక్షరటుడే, కోటగిరి: Temple Visits Children | పిల్లలను గుడికి పంపితే జ్ఞాపకశక్తి ఏకాగ్రత, పెరిగి మంచి ఆలోచనలు వస్తాయని హంపీ విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు. పోతంగల్ మండల (Pothangal Mandal) కేంద్రంలోని బాలాజీ మందిరం వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు.
Temple Visits Children | ప్రత్యేక కార్యక్రమాలు..
ఆలయంలో ఉదయం నుంచి హన్మంత్ రావు జోషి, శ్రీనివాస్ జోషి, రామ్ శర్మ సుధీర్ త్రిపాఠి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారణ్య భారతి స్వామి మాట్లాడుతూ.. ముఖ్యంగా పిల్లలలో మంచి ఆలోచనలు రావాలంటే రోజు గుడికి పంపాలన్నారు.

41 రోజులు ప్రతిరోజు గుడికి పంపితే వారి జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. పిల్లలు గుడికి వెళ్ళిన తర్వాత దేవుని చిన్న శ్లోకాలు నేర్పాలని ఆయన సూచించారు. గణపతి ఆలయానికి వెళ్తే వక్రతుండాయ మహాకాయ అని.. విష్ణువు దగ్గరికి వెళ్లినప్పుడు శాంతాకార భుజాగ శ్రేయనం వంటి శ్లోకాలు చెప్పాలన్నారు. భక్తులు ప్రతినిత్యం భగవంతుని నామస్మరణ చేస్తే అంతా మంచి జరుగుతుందన్నారు. అనంతరం విద్యారణ్య భారతి స్వామికి నోట్ బుక్స్, పెన్నులతో తులాభారం వేశారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Dubai Driver Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. దుబాయ్లో డ్రైవర్, రైడర్ ఉద్యోగాలు