Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 26న రైతు భరోసా విడుదల

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వానాకాలం సాగు సీజన్​కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa Funds | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రైతులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వానాకాలం సాగు సీజన్​కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసా (Rythu Bharosa)గా మార్చిన విషయం తెలిసిందే. ఎకరాకు రూ.6 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే కాంగ్రెస్​ రెండున్నరేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే పూర్తిస్థాయిలో రైతు భరోసా జమ చేసింది. గత వానాకాలం సీజన్​లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో వేసింది. పోయిన యాసంగి సీజన్​లో రెండు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు వేసింది. అది కూడా ఆలస్యంగా వేయడంతో ప్రస్తుత సీజన్​లో డబ్బులు ఇస్తారా లేదా అని రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 26న సీఎం రేవంత్​రెడ్డి నిధులు విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది.

Rythu Bharosa Funds | మధిరలో బహిరంగ సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూన్ 26న మధిరలో జరిగే బహిరంగ సభలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను రైతులకు విడుదల చేయనున్నారు. జూన్ 26 నుండి 9 రోజుల్లోగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం సుమారు రూ. 9,000 కోట్లను జమ చేయనుంది. భూమి విస్తీర్ణానికి సంబంధించి ఎటువంటి పరిమితులు లేవు. ఎన్ని ఎకరాల భూమి ఉన్న డబ్బులు జమ అవుతాయి. దాదాపు 1.50 కోట్ల ఎకరాలకు రైతు భరోసా వర్తించనుంది. మరోవైపు సన్నరకం వరి విత్తనాల సరఫరా, కొనుగోళ్ల పర్యవేక్షణకు వ్యవసాయ కార్యదర్శి ఛైర్మన్‌గా సమన్వయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి..: TG20 Cricket Controversy | TG20 నిర్వహణపై తెలంగాణ క్రికెట్​ అసోసియేషన్​ అభ్యంతరం.. సెలబ్రిటీలకు నోటీసులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *