అక్షరటుడే, కామారెడ్డి: Congress disciplinary committee | కామారెడ్డి కాంగ్రెస్ (kamareddy congress) పార్టీలో వరుస వివాదాలపై క్రమశిక్షణ కమిటీ విచారణ ప్రారంభించింది. ఇదివరకే టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి కమిటీ ఛైర్మన్ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
Congress disciplinary committee | ఛైర్మన్ లేకపోవడంతో..
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి (shabbir ali) సైతం వైరల్ అయిన ఆడియోపై వివరణ ఇవ్వాలని లేఖలో కోరగా ఆయన కూడా కమిటీకి లిఖిత పూర్వకంగా వివరంగా ఇచ్చారు. తాజాగా గురువారం మరోసారి కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి, కామారెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ(Indu Priya) హాజరయ్యారు. కమిటీ ఛైర్మన్ మల్లు రవికి పలు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కమిటీకి వివరణ ఇచ్చానని, ఆరోజు ఛైర్మన్ అందుబాటులో లేకపోవడంతో మరోసారి వచ్చి వివరణ ఇవ్వడం జరిగిందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.