Gadugu Gangadhar House Fire | తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇంట్లో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన నివాసం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gadugu Gangadhar House Fire | తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Gadugu Gangadhar House Fire | విలువైన వస్తువులు మంటల్లో

ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోంది.

ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఇంట్లోని ఫర్నిచర్, గృహోపకరణాలు, ఇతర విలువైన వస్తువులు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యుల పరిస్థితి, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

UAE Social Media | 15 ఏళ్లు నిండితేనే సోషల్‌ మీడియా ఖాతాలు.. యూఏఈ సంచలన నిర్ణయం

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *