Telangana Student Missing | ఫిన్లాండ్​లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం

ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం అయ్యాడు. 45 రోజులుగా ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Student Missing | ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం అయ్యాడు. 45 రోజులుగా ఆచూకీ గల్లంతు కావడంతో ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని వనస్థలిపురంలోని వైదేహి నగర్‌కు చెందిన మణిదీప్ రెడ్డి ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్​ వెళ్లాడు. అక్కడ ఓ యూనివర్సిటీలో బీటెక్​ ఫస్టియర్​ చదువుతున్నాడు. గత నెల 4న మణిదీప్​ తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడారు. తర్వాత రోజు నుంచి ఫోన్​ చేయలేదు. కుటుంబ సభ్యులు ఫోన్​ చేసినా స్పందించడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఫిన్‌లాండ్‌లోని స్నేహితులు, తెలిసిన వారిని మణిదీప్​ రూమ్‌కు, కాలేజీకి పంపించినా ఎలాంటి సమాచారం లభించలేదని వారు తెలిపారు.

Telangana Student Missing | మిస్సింగ్​ కేసు

మణిదీప్​రెడ్డి కనిపించకపోవడంతో ఫిన్లాండ్​లో మిస్సింగ్‌ కేసు కూడా నమోదు చేశారు. 45 రోజులు గడుస్తున్నా అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయను కలిసి సహాయం కోరారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Medical Negligence | వైద్యుల నిర్లక్ష్యంతో రెండు ప్రాణాలు బలి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *