అక్షరటుడే, వెబ్డెస్క్: Kavitha Allegations | సింగరేణి సమస్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె భూపాలపల్లి జిల్లా (Bhupalapally District)లో గనులను పరిశీలించారు.
సింగరేణి అధికారుల పీఆర్పీ చెల్లింపునకు డిప్యూటీ సీఎం లంచం అడుగుతున్నారని కవిత ఆరోపించారు. నిషేధిత డిటోనేటర్ల కొనుగోలు, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు వంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 20 వరకు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. జూన్ 20న భూపాలపల్లి కాకతీయ ఖని – 5 గని పై కార్మికుల సమక్షంలో ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నామని తెలిపారు. జులై 20లోగా సింగరేణి కార్మికుల కోసం మెడికల్ బోర్డు నిర్వహించకుంటే గాంధేయ మార్గంలో నిరహార దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. ప్రతి నెలా రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి పెండింగ్ లో 1200 కార్మికులకు వైద్య పరీక్షలు చేయాలన్నారు. అర్హులైన వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
Kavitha Allegations | ఉద్రిక్తతత
భూపాలపల్లి 5ఇంక్లైన్ గని దగ్గర టీఆర్ఎస్ చీఫ్ కవితను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైన్లోకి వెళ్లకుండా ఆపడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వావాదం, తోపులాట జరిగాయి.
ఇది కూడా చదవండి..: Heavy Rain Alert | నేడు భారీ వర్ష సూచన